పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడారు. పుష్ప వన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజి మీద నుంచి బన్నీతో అన్నాను. బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయి సినిమాని అక్కడ అని. మూడేళ్లయింది ఈ మూడేళ్ల తర్వాత పుష్పా 2 కి బన్నీతో చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇండియా మొత్తం ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారు అని అర్థం అయిపోతుంది. జనరల్గా ఏదైనా సినిమా ఫంక్షన్ కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో హెల్ప్ అవ్వాలి. హీరో గురించి మాట్లాడిన, డైరెక్టర్ గురించి మాట్లాడిన అందులో మనకి నచ్చిన విషయాల గురించి మాట్లాడిన మ్యూజిక్ గురించి మాట్లాడిన ఆ సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలనుకుని మాట్లాడుతూ ఉంటాం. ఈ సినిమాకి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు సో అందుకని జరిగిన ఒక సరదా విషయం మీతో పంచుకుంటున్నాను. సినిమాని పొగడడం కన్నా అలా సరదాగా జరిగిన విషయాన్ని ఒకటి మీతో పంచుకుంటున్నాను అని మొదలుపెట్టారు.
రెండు మూడు నెలల క్రితం అనుకుంటా రామోజీ ఫిలిం సిటీ లో పుష్ప షూటింగ్ జరుగుతుంటే నాకు కూడా ఏదో చిన్న పని ఉండి అటు పక్కకి వెళితే షూటింగ్ లోకేషన్ కి వెళ్ళాను. సుకుమార్, బన్నీ ఇద్దరు అక్కడే ఉన్నారు కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత సుక్కు సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు. ఎందుకు చూడను చూపిస్తే చూస్తానని అన్నాను. ఎడిటర్ ని పిలిచి ఆ సీన్ ఏదో కరెక్షన్ చేసి చూపించు అన్నారు. ఎడిటర్ కరెక్షన్స్ చేస్తున్నాడు. ఈ లోపల బన్నీ సుక్కు ఇద్దరూ నాతో డిస్కషన్ పెట్టారు. సుకుమార్ అంటాడు ఎవరన్నా సీన్ ముందు చూపిస్తా అంటే నేను చూడను అంటాడు. ఎందుకంటే తర్వాత ఏం చెప్పాలో నాకు తెలియదు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు బన్నీ కూడా నేను కూడా అలా అస్సలు చూడను అలా ఎవరైనా చూపిస్తే వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్ది అని అంటాడు. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తూ నా ఫీలింగ్స్ అన్ని వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. దాదాపు వీళ్ళిద్దరి డిస్కషన్ 10 నిమిషాల పాటు జరిగింది. ఆ టెన్ మినిట్స్ తర్వాత సుకు నాకు సీన్ చూపించాడు.
ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్ లో అంటూ ఉండగానే సుకుమార్ టెన్షన్ గా చూస్తుండడంతో నువ్వు హార్ట్ ఎటాక్ తెచ్చుకోకు సీన్ ఏంటో నేను చెప్పడం లేదు సీన్ ఎలా ఉంటుందో చెబుతున్నాను అనడంతో నవ్వేశారు. ఆ సీన్ చూసిన తర్వాత నేను ఒకే ఒక మాట అన్నాను. ఈ సీన్ కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత. ఎంత స్కోప్ కావాలంటే అంత ఏ రేంజ్ కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్ ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. బన్నీ ఇరగ కొట్టేసాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒక్కటే చూశాను. ఇక సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో అప్పుడే అర్థమైపోయింది. డిసెంబర్ 5 కూడా కాదు డిసెంబర్ 4 సాయంత్రం ప్రపంచానికి అందరికీ అర్థం అయిపోతుంది. అంటే నాకు నిజంగా ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పాలి అనిపించడం లేదు. ఈ సినిమాకి ఇంకేమని చెప్పాలి, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అజ్ అంటూ ఆయన పేర్కొన్నారు.. అదిగో వర్షం పడుతుంది బ్లెస్సింగ్స్ ఫ్రం ది హెవెన్. డిసెంబర్ 4 ఈవినింగ్ పుష్పరాజు రూల్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటూ రాజమౌళి ముగించారు.