Fire Accident : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద గల సోఫా తయారీ షాపులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద మహావీర్ సోఫా వర్క్స్, మస్కిటో డోర్స్ షాప్ చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపులో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.
Andhra Pradesh: విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సమీపంలోని ఇళ్లకు, షాపులకు మంటలు అంటుకోకుండా అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!