పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. పుష్ప వన్ రిలీజ్ అప్పుడు చెప్పాను తగ్గేదే లేదని. అప్పుడు ఎందుకు ఆ సినిమా అయిపోయే సరికి అందరూ అడిగేవాళ్లు. ఆ సినిమా అయిపోయిటప్పటికీ పుష్ప 2 కథ వినలేదు కానీ పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అని చెప్పేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇవాళ చాలామందికి థాంక్స్ చెప్పాలి సో కొంచెం అందరినీ గుర్తుతెచ్చుకొని అందరికీ థాంక్యూ చెప్పాలి. నేను థాంక్యూ చెప్పడం తప్ప ఇవాళ చెప్పేదేమీ లేదు. అని అంటూ ఉండగానే ఒక అభిమాని బన్నీని టచ్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చుట్టూ ఉన్న బౌన్సర్లు అతని పట్టి లాగేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ వారిని ఆపి ఫోటో దిగి పంపించాడు.
Sukumar: సుకుమార్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
ఐ లవ్ మై ఫాన్స్ కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితం ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరందరూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు మా సొంత ఫంక్షన్ లో మీ అందరినీ కలుస్తున్నట్టు అనిపిస్తోంది. మై డియర్ ఫాన్స్ ఎంతో ముద్దుగా మీ అందరినీ నా ఆర్మీ అంటుంటాను మై ఆర్మీ మై ఫాన్స్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు ఐ లవ్ యు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా అంతకన్నా ఇంకేమీ చెప్పలేను నేను. మా నిర్మాతలు మైత్రి నవీన్ గారు రవి గారు థాంక్యూ సో మచ్. నేను చెబుతున్నాను ఈ సినిమా వాళ్లు కాకుండా ఇంకా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. మమ్మల్ని ఎంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు కుమ్మరించినందుకు నవీన్ రవి ఇద్దరికీ థాంక్స్ అని ఆయన అన్నారు.