Konda Vishweshwar Reddy : చేవెళ్ల మండలం ఆలూరు గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. నేను ఇవాళ సాయంత్రము పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ దుర్ఘటనలో గురించి తెలిసిందని, తీవ్ర ఆందోళనకు లోనయ్యానన్నారు. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినారు అని, పది మందికి పైగా తీవ్రమైన గాయాలు అయ్యాయని నాతో చెప్పారని, హైదరాబాద్ వైపు నుంచి చేవెళ్ల వైపు పోతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఆలూరు గేటు మీద కూరగాయాలు అమ్ముకునే వారి మీదకు లారీని నడిపిండు అని స్థానికులు చెప్తున్నారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, నిన్న కూడా ఖానాపూర్ గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భార్య భర్తలు చనిపోయారన్నారు. వారి కుమారుడితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
Dead Body : కాళేశ్వరం గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం
అంతేకాకుండా..’ అంతకు ముందు మొయినాబాద్ లో బైక్ మీద వెళ్తున్న యువకులకు ప్రమాదం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరగడం అత్యంత విచారం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. నేను రేపు ఢిల్లీ నుంచి తిరిగి వస్తాను, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భాధిత కుటుంబాలకు అందుబాటులో ఉండి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా మన్నెగూడ వరకు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో దురదృష్టం, మొన్న నవంబర్ 18 నాడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు జాతీయ రహదారుల అధికారులతో రోడ్డు పనుల ఆలస్యం మీద సమీక్ష నిర్వహించాను, పనులు మొదలు అవుతాయని హామీ ఇచ్చారు, ఇంతలోపే ఇటువంటి దారుణ సంఘటనలు జరగడం బాధాకరం. ఇవాళ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ధైర్యం చెపుతున్నాను’ అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!