DMR Sekhar Resigns: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రాజీనామాలు, వలసలు కొనసాగుతూనే ఉండగా.. ఇప్పుడు జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది.. ఇప్పటికే కొందరు నేతలు.. టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయగా.. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు.. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డీఎంఆర్ శేఖర్.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఈ మేరకు తన రాజీనామా లేఖను జనసేన పార్టీ అధిష్టానానికి పంపించారు శేఖర్.. 2019 ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకిదిగి ఓటమిపాలైన శేఖర్.. ఈ సారి అమలాపురం పార్లమెంట్ లేదా అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు.. చివరకు ఆయనకు నిరాశే మిగిలింది.. దీంతో, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. మరి, ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఏ పార్టీలో చేరతారు? అనేది తేలాల్సిన అంశం.
Read Also: LSG vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..
కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. టికెట్ దక్కన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం.. సొంత పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.. ఈ పరిణామాలు కూడా మరికొన్ని స్థానాల్లో చిచ్చు పెట్టాయి.. ఎన్నికలకు సమీపిస్తున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా నేతలు గ్రూప్ లు కట్టడం.. ప్రధాన పార్టీలకు ఇబ్బంది కరంగా మారిన విషయం విదితమే..