అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఇక, టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మొదటి సీఎస్కే బ్యాటింగ్ చేయనుంది. ఈ సందర్భంగా ఎల్ఎస్జీ సారథి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. ఇది మంచి వికెట్ లాగా ఉంది.. ఇక్కడ మంచు పెద్దగా కనిపించడం లేదు.. ఈ వికెట్ 40 ఓవర్ల వరకు బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను.. మేము ప్రతి మ్యాచ్ లో 100 పర్సెంట్ కమిట్మెంట్ తో ఆడుతున్నాం.. కేకేఆర్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమి నుంచి గుణపాఠాలు నెర్చుకున్నాం.. ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధిస్తామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించారు.
Read Also: Mamata Banerjee: కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఇక, సీఎస్కే కెప్టెన్ రుత్ రాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము ముందుగా బౌలింగ్ చేసి ఉండే వాళ్లం అని పేర్కొన్నారు. చివరి గేమ్‌లో మొదట బ్యాటింగ్ చేసి ముంబైపై విజయం మా జట్టుకు బూస్టర్ లాంటిదన్నారు. అందరూ ఈ పిచ్ పై గెలుస్తామని ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.. ప్రస్తుతం జట్టులో రెండు మార్పులు చేశాం. డారెల్ మిచెల్ స్థానంలో మో, శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ వచ్చారు అని చెన్నై సూపర్ కింగ్స్ సారథ గైక్వాడ్ వెల్లడించారు.
Read Also: Salaar Bike : ఈ ఒక్క పని చేస్తే చాలు సలార్ బైక్ మీ సొంతం..
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ ( కెప్టెన్ ), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ( వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా. చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిషాంత్ సింధు, మిచెల్ సాంట్నర్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ ( వికెట్ కీపర్/ కెప్టెన్ ), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్. లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, అర్షద్ ఖాన్.