Bangladesh: బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు (NSA) ఖలీలూర్ రెహమాన్ ఈరోజు న్యూఢిల్లీలో భారత NSA అజిత్ దోవల్‌ను కలిశారు. షేక్ హసీనాను అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే భారత్, బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారిన ఈ సమయంలో అజిత్ దోవల్ ఢాకాలో పర్యటించాల్సిందిగా రెహమాన్ ఆహ్వానించారు. కొలంబో భద్రతా కాన్‌క్లేవ్ యొక్క 7వ NSA సమావేశంలో ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు.
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ…
Taliban: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్యసమితి అనుమతి పొందిన తర్వాత, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు. ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకీకి, భారత పర్యటన కోసం యూఎన్ అనుమతి ఇచ్చింది. 2021లో ఆఫ్ఘాన్‌లో తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత, ఓ తాలిబాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. భారత, తాలిబాన్ అధికారులు పలుమార్లు యూఏఈ వేదికగా చర్చించారు. ఆఫ్ఘాన్‌కు మానవతా సాయం కింద భారత్…
Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది.
చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అజిత్ దోవల్ వివరించారు. భారతదేశం నష్టాన్ని చూపించే ఒక్క చిత్రాన్ని అయినా తనకు చూపించాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పలు విదేశీ మీడియా సంస్థలు పాకిస్థాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయని కథనాలు రాశాయి. ఈ అంశంపై తాజాగా జాతీయ భద్రతా సలహాదారు…
Ajit Doval: బీజింగ్ వేదికగా జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతా అంశాలపై పలు కీలక వ్యాఖ్యలను చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనాల్సిన అవసరాన్ని ఉందని ఆయన స్పష్టం చేశారు. మే 7న భారత్ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది. పహల్గామ్…
కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా మండలి పనిచేయనున్నది. డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) మాజీ చైర్మన్. భారత…
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
IND PAK War: ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఓ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షలు చేపట్టారు. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అధికారులతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు సమావేశంలో పాల్గొన్నారు. వీరందరూ దేశ భద్రతకు సంబంధించి…