ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI180 సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయబడింది. బాధిత ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు లేదా చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన ప్రయాణికుల కోసం హోటల్ వసతితో పాటు రవాణా కోసం చేసే అన్ని ఖర్చులను కూడా మేము తిరిగి చెల్లిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.
Read Also : Thief Forgot Phone: దోచుకునేందుకు వచ్చి.. సెల్‌పోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోయిన దొంగ
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యాన్నికి తాము చింతిస్తున్నట్లు విమానాయన సంస్థ పేర్కొంది. అయితే ముంబైకి వెళ్లే విమానాన్ని రద్దు చేయడానికి ముందు ప్రయాణికులు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో చాలా గంటల పాటు వేచి ఉన్నారు.
Read Also : MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..
అయితే ప్లైట్ క్యాన్సిల్ కావడంతో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెల్లించిన పూర్తి డబ్బును వాపసుగా తిరిగి ఇవ్వలని డిమాండ్ చేశారు. అలాగే ఇదే ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.విమానయాన సంస్థలు ఇలా చేయడం వల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా అధికారి ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు.