ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దైంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా.. వర్షం కారణంగా తొలి టెస్టులో మొదటి రోజు ఆట రద్దయింది. టాస్ పడకుండానే ఆట రద్దు అయింది.
నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న సాక్ష్యాధారాలు లేని కారణంగా ఓ ఖైదీకి విధించిన జీవిత ఖైదును అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో అతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జూలై 9,16వ తేదీలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 9వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 16 వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దైంది. ఈనెల 21, 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నన్నారు.
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చే రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని రైల్వే ప్రతినిధి తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో రేపు కొత్త నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI180 సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయబడింది. బాధిత ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించామని ఎయిర్‌లైన్స్ తెలిపింది.