ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్‌కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
Pakistan: భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని నిరాకరిస్తూ, జనవరి 24 వరకు నిషేధాన్ని పొడగించింది. ఈ మేరకు పాకిస్తాన్ తాజాగా నోటమ్ (Notice to Airmen) జారీ చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు ఎయిర్‌స్పేస్‌ను నిరాకరించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాలు పరస్పరం గగనతలాన్ని నిషేధించుకున్నాయి. గత 9 నెలలుగా ఇది కొనసాగుతోంది.
ఎయిరిండియా విమాన సంస్థపై ప్రముఖ సితార్ వాయిద్య కళాకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో ప్రయాణించేటప్పుడు తన సితార్ విరిపోయిందని.. దీనికి ఎయిరిండియానే కారణమంటూ తీవ్ర కోపాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆదివారం మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ముందస్తు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ చేసిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్‌కతా మీదుగా నడుస్తున్న ఈ విమానం AI174 ఉలాన్‌బాతర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం, సాంకేతిక తనిఖీలు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Delhi Visakhapatnam Flight: ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని…
Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరస ప్రమాదాలతో సతమతమవుతోంది. సాంకేతిక సమస్యలు, పక్షుల తాకిడి వంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా, కొలంబో నుంచి చెన్నై వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అధికారులు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే, ఇదే సంస్థకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విమానం పొట్ట నుంచి బయటకు వచ్చే రామ్ ఎయిర్ టర్బైన్(RAT) ఎలాంటి హెచ్చరికలు లేకుండా బయటకు వచ్చింది. దీంతో విమానం యూకేలోనే నిలిచిపోయింది.
KC Venugopal post about India Flight Emergency Landing: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి…
Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది చనిపోయారు. విమానంలో ఉన్న వారితో పాటు కింద ఉన్న వారితో సహా 270 మంది మరణించారు. బోయింగ్ 787-8 డ్రీమ్లైనన్ విమానం ప్రమాదానికి గురైంది.