అగ్నిబాన్ మిషన్ ప్రయోగం వాయిదా పడింది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో రెండో రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సిద్ధమైంది. అయితే టెక్నికల్ సమస్యతో ఈ ప్రయోగానికి ఇబ్బందులు తలెత్తాయి
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది.
కేరళ రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆదివారం, విమానంలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా టేకాఫ్ అయిన రెండు గంటలకే తిరిగి వచ్చిందని తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI180 సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయబడింది. బాధిత ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించామని ఎయిర్‌లైన్స్ తెలిపింది.