తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్ లకు, సీఎస్ కు డేటా ఇస్తామని చెప్పారు. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదని తెలిపారు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామన్నారు. హరీష్ రావు ఆఫీసు పై దాడి చేశారని.. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారన్నారు.ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
READ MORE: Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్‌పూర్‌లో మతహింస..
నిన్న సీఎంకు అనుకూలంగా ఉండే ఒక మీడియా ప్రభుత్వ అధికారిపై దాడి చేసేటంత పని చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. హోమ్ మంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకు ఢిల్లీ నుంచి ఒక సమాచారం వచ్చింది. రేవంత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం ఏబీవీపీ నుంచే ప్రారంభించారు. చనిపోయే నాటికి బీజేపీలోనే ఉంటానని మోడీకి చెప్పారట. తాను చనిపోయే టైంకి తన మీద బీజేపీ జెండా ఉంటుంది అని మోడీ కి మాట ఇచ్చారట. అలా చెప్పారో లేదో రేవంత్ రెడ్డి సమాధనమివ్వాలి. ” అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.