అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేనేత కాలనీలో ఏర్పాటు చేసిన 20 అడుగులు గల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విగ్రహం కిందపడింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని… Ghmc పరిధిలో సుమారు 40 వేల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. వీటిలో కోన్ని 3 వ రోజు, 5 వ రోజు మరికొన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందని… ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా…