హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
Ganesh Immersion: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా రెండో రోజు కూడా భారీగా శోభయాత్రలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు హృదయపూర్వకంగా గణేశుని పరాయణం చేస్తూ శోభయాత్రను జరుపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వైపు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు అనేక గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మరోవైపు పాత బస్తీ ప్రాంతం నుంచి మార్కెట్ దాకా వేలాది మంది భక్తులు పాల్గొని గణేశుని శోభాయాత్రను…
గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు రాత్రంతా MMTS రైళ్లను నడపనున్నారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు.
జగిత్యాల జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో ట్రాన్స్‌జెండర్‌ల చే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టిన పోలీస్ లు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాల నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు మాట్లాడుతూ….“గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్‌జెండర్‌లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందించే మంచి సందేశం వెళ్తుంది అని పేర్కొన్నారు.…
తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలివెళుతున్నాడు. గణపయ్య భక్తులు డప్పు చప్పుళ్లతో, భజనలతో, ఆటపాటలతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. గణేష్ శోభాయాత్ర కన్నులపండుగగా జరుగుతోంది. ఇక వినాయక వేడుకల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది గణేష్ లడ్డూ. నిమజ్జనానికి ముదు లడ్డూ వేలం పాట వేస్తుంటారు నిర్వాహకులు. విఘ్నేషుడి లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. వినాయకుడి లడ్డూ సొంతం చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే ఐష్టైశ్వర్యాలు సిద్ధి్స్తాయని.. సుఖశాంతులు విలసిల్లుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. Also Read:Nag Ashwin : ప్రధాని…
నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. “పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశాము.. 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుంది.. రేపు ఒక్క ట్యాంక్ బండ్ లోనే 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి.. నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాము.. నిన్న కూడా ఛత్రినాకలో ఒక ఘటన జరిగింది.. విగ్రహం ఎత్తు ఉండటం వల్ల కరెంట్ వైర్ కు తగలకుండా…