Ganesh Immersion: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. PM Manipur Visit: మణిపూర్‌కు ప్రధాని మోడీ.. 2023 తర్వాత ఇదే తొలి పర్యటన మృతులను తూర్పు తాళ్ళు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, జి మురళి, ఇమన సూర్యనారాయణ, దినేష్ గా గుర్తించారు.…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సంస్థ మెట్రో సేవలను పొడిగించింది. ఆగస్ట్ 30న ప్రత్యేకంగా పొడిగించిన సేవలు అందిస్తోంది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా..ఎక్కువ సమయం.. ఎక్కువ భక్తి.. ఎక్కువ సౌకర్యం.. అంటూ హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. నగరంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేషుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లోనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తోంది.. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసింది..
ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా రికార్డ్ స్థాయిలో రూ. 400 కోట్లు, 2023లో రూ.…
విజయవాడ గ్రామీణం నున్న పంచాయతీ పరిధిలోని పవర్ గ్రిడ్ సెంటర్ శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లీవ్ అపార్ట్‌మెంట్‌లో నెలకొల్పిన వినాయక విగ్రహం విపోధా ఫిస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేడుకల చివరి రోజును నిర్వహించి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని రూ 26 లక్షలకు సొంతం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేనేత కాలనీలో ఏర్పాటు చేసిన 20 అడుగులు గల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విగ్రహం కిందపడింది.
మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు.. ప్రతీ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు.. ఫారిన్ నుండి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నాడు.. ప్రతీ ఏడాది మూడు నెలల ముందే వచ్చి.. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు.. ఇది ఏ ఒక్కసారికే పరిమితం కాలేదు.. వరుసగా 19 ఏళ్ల నుంచి గణేష్ నవరాత్సి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు.. అతడే హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ..
Litton Das Celebrated Ganesh Chaturthi: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వినాయక చవితిని శనివారం నాడు అంగరంగ వైభవంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అనేక దేశాలలో హిందూ మతంలో ఉన్నవారు గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. ఈ మధ్యకాలంలో విదేశీయులు కూడా కొందరు హిందూ తత్వాన్ని ఇష్టపడి హిందూ సంస్కృతిని పాటిస్తున్నారు. కొన్ని దేశాలలో అయితే ఏకంగా కొందరు శాస్త్రాలు నేర్చుకుని పురోహితం కూడా చేస్తున్నారంటే నమ్మండి. ఇకపోతే అన్య మతస్తులైన కొందరు…
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి.
Bandi Sanjay: గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్షలో పాల్గొన్నారు.