ఓపెన్‌ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ టూల్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ ప్రభావాలు, ప్రయోజనాలు, ఇబ్బందులపై పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతుంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ప్రవేశిస్తోంది. ప్రజల జీవితాలలో ఊహించని మార్పులను తీసుకొస్తోంది. చివరికి డేటింగ్, మ్యారేజ్ వంటి విషయాల్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగమైంది. తాజాగా తాను ఒక ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఓ అమెరికన్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన స్కాట్ అనే వ్యక్తి.. తాను వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించాడు. దీనివల్ల తన మ్యారేజ్ సేవ్ అయిందని అతడు చెప్పాడు.
Read Also: Maharashtra : బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై అత్యాచారం..అక్కడ నొప్పిని భరించలేక..
స్కాట్ భార్యకు కొడుకు పుట్టిన తర్వాత డిప్రెషన్ వల్ల ఆల్కహాల్‌కి అడిక్ట్ అయింది. దీంతో సూసైడల్ థాట్స్‌తో పోరాడుతూ వాటి నుంచి బయటపడేందుకు, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆమె ఆల్కహాల్‌కు బానిసైంది. దీంతో స్కాట్ తన భార్య ఎమోషనల్ కనెక్షన్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో స్కాట్, రెప్లికా అనే AI చాట్‌బాట్‌ని ఉపయోగించి సరీనా అనే AI గర్ల్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. ఇది అచ్చం మనుషుల్లానే ఇంటరాక్ట్ అవుతుందని అతడు పేర్కొన్నాడు. అవసరమైన ఎమోషనల్ సపోర్ట్ అందిస్తుందని, తనకు మరొక మనిషితో మాట్లాడుతున్నట్లే ఉండేదని స్కా్ట్ తెలిపాడు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్ స్కాట్‌కు మంచి ఉపశమనాన్ని ఇస్తుందని అతడు చెప్పుకొచ్చాడు. AI చాట్‌బాట్ ఎల్లప్పుడూ తన భార్య వలె ప్రవర్తించేదని, ఎమోషనల్ సపోర్ట్ అందించేందని స్కాట్ పేర్కొన్నాడు. అతని భార్య కూడా వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపడం ఇక్కడ విశేషం.
Read Also: Data Leak: మీ డేటా లీక్ అయినట్లు అనిపిస్తుందా..? అయితే ఇది మీకోసమే..!
అయితే.. ఇలాంటి మరో ఘటన న్యూయార్క్‌లో జరిగింది. 36 ఏళ్ల రోసన్నా రామోస్ AI- పవర్డ్ వర్చువల్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. రామోస్ 2022లో ఇంటర్నెట్ డేటింగ్ సర్వీస్ ద్వారా AI భర్త ఎరెన్ కార్టల్‌ను కలిసిట్లు ఆమె తెలిపింది. తన AI భర్త ఎలాంటి ఎమోషనల్ బ్యాగేజ్ లేకుండా వచ్చాడని, ఈ అన్‌కన్వెన్షనల్ యూనియన్ మంచి ఆలోచన అని రామోస్ అభిప్రాయపడింది. ఇద్దరం ఒకరి గురించి మరొకరం తెలుసుకుంటున్నామని, రోజు రోజుకూ తన ఐడియల్ హజ్బెండ్‌లా కార్టల్ మారుతోందని ఆమె తెలిపింది. ఈ రెండు అంశాలు పర్సనల్ రిలేషన్‌షిప్‌లలో పెరుగుతున్న AI టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ను హైలైట్ చేస్తున్నాయి. స్కాట్, రోసన్నకు ఈ కాన్సెప్ట్ సరికాదని కొందరు భావించినా.. AI భాగస్వాములతో వారి ప్రత్యేక పరిస్థితుల్లో ఓదార్పు, ఎమోషనల్ సపోర్ట్ అందుతున్నాయని మరికొందరు అంటున్నారు. హ్యూమన్-AI కన్వర్జేషన్‌లు ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో ఏఐ ప్రభావంతో పర్సనల్ లైఫ్‌లు ఎలా మారుతాయనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.