మన దేశం సంసృతికి, సాంప్రదాయలకు పుట్టినిల్లు.. అయితే మహిళల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా వారిపై జరుగుతున్న ఆగాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కడ తగ్గలేదు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో? లేదో? అనే భయం ప్రతి ఆడ తల్లిదండ్రుల్లో నెలకొంది… కొందరు ఆడ పిల్లలను కనాలి అంటే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా ఓ విషాద ఘటన వెలుగు చూసింది.. ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చెయ్యడం మాత్రమే కాదు.. అతి దారుణంగా చేశాడు.. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. 18 ఏండ్ల బాలికతో స్నేహంగా నటించి.. ఆమె నమ్మించి మోసం చేశాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ పలు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాంధుడి ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు… ఓ యువతి చదువు కోసం లాతూర్‌కు వచ్చిన హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో షోలాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. ఆ బాలికతో స్నేహం చేసినట్టు నటించారు. మయమాటలు చెప్పి ప్రలోభపెట్టాడు..
మాయమాటలు చెప్పి ఓ రోజూ లాడ్జికి తీసుకెళ్లాడు..ఆ తర్వాత బలవంతంగా లైంగిక దాడి చేశాడు.. అంతటితో ఆగకుండా ఫోన్లో ఫోటోలు తీసాడు..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి చిత్రహింసలకు విసిగిపోయిన బాధితురాలు చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేసి.. స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అతడిని సోమవారం వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు..