మహిళలు, యువతుల పట్ల వేధింపులు ఆగడం లేదు. ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలతో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తను మనిషి అన్న సంగతి మరిచాడు. కూతురు వయసున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కనే కూర్చుని బాలికపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ మృగంలా ప్రవర్తించాడు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు…
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పంజాబ్లోని జలంధర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జండియాల మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాలిపోతున్న చితిలోకి దూకాడు. దీంతో.. అతనికి మంటలు అంటుకుని 70 శాతం కాలాయి. ఆ వ్యక్తిని జండియాలా మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ (50)గా గుర్తించారు.
యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్‌చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్‌ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్‌లోని జరిగింది.
మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై ఎద్దు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కాన్పూర్ జిల్లా డిప్యూటీ జడ్జి మృతి చెందారు. ఆదివారం ఉదయం కళ్యాణ్‌పూర్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు పలుమార్లు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. బాటసారులు అతన్ని ఎలాగోలా ఎద్దు బారినుంచి తప్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే అతను చనిపోయినట్లు వైద్యులు…
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడును తాను కానని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేశారు.
తాజాగా తాను ఒక ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఓ అమెరికన్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన స్కాట్ అనే వ్యక్తి.. తాను వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించాడు. దీనివల్ల తన మ్యారేజ్ సేవ్ అయిందని అతడు చెప్పాడు.
Marriage : మేనల్లుడు పెళ్లికి రాలేదన్న చిన్న కారణంతో భార్య, పిల్లలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక చాంద్‌వాడ్‌లోని కుండల్‌గావ్‌లో పూనమ్ చంద్ పవార్ అనే వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనతో చందవాడ్ తాలూకా ఉలిక్కిపడింది.