Data Leak: మీ డేటా లీక్ అయినట్లు అనిపిస్తుందా..? అయితే ఇది మీకోసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో వెబ్ బ్రౌజర్లు, సెర్చ్ ఇంజన్లు యాక్సెస్ చేయలేని ఒక పార్ట్ ఉంటుంది. అదే డార్క్ వెబ్ సైట్. ఇది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు డార్క్ వెబ్ వేదికగా నిలుస్తుంది. ఇలాంటి హానికరమైన ప్లాట్‌పామ్‌లో యూజర్ల డేటా లీకైతే.. వారి సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్ద ముప్పు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే అసలు డార్క్ వెబ్‌లో ఒకరి డేటా లీక్ అయిందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. హ్యాకర్లు యూజర్ల డేటాను దొంగలించి వాటిని ఇల్లీగల్ మార్కెట్‌గా పని చేసే డార్క్ వెబ్‌లో ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటారు. ఆ డేటాలో యూజర్ల క్రెడిట్ కార్డు, బ్యాంకు అకౌంట్ వంటి ఫైనాన్షియల్, ఫొటోలు, వీడియోల వంటి పర్సనల్ డీటేల్స్ ఉండే అవకాశం ఉంది.
Read Also: AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఆ డేటా కొనుగోలు చేసిన వారు యూజర్ల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ఛాన్స్ ఉంది. వారి పర్సనల్ డేటాతో అక్రమాలకు పాల్పడవచ్చు.. ఇలాంటి ప్రమాదం తమకు ఎదురయ్యే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి యూజర్లు కొన్ని టూల్స్ ఉపయోగించి.. తమ పర్సనల్ డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. యూజర్ తమ ఈ-మెయిల్ అడ్రస్ నుంచి ఫైనాన్షియల్ డేటా వరకు డార్క్ వెబ్‌లో సర్క్యులేట్ అవుతుందో లేదో చెక్ చేయడానికి F-Secure Have I Been Pwned వంటి టూల్స్ వినియోగించవచ్చు. లేదంటే ఈజీగా https://www.f-secure.com/en/identity-theft-checker లింక్‌పై క్లిక్ చేస్తే చాలా నేరుగా యూజర్లు తమ డేటా లీక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.
Read Also: Honour killing: ప్రేమిస్తోందని కూతురుని చంపేసిన తండ్రి.. లవర్‌ని కూడా వదిలిపెట్టలేదు..
యూజర్లు ఈ టూల్స్‌లో ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.. తరువాత ఆ అకౌంట్ డేటా లీక్ అయిందో లేదో చూడటానికి ఈ టూల్స్ తమ డేటాబేస్‌లను చూపిస్తుంది. అనంతరం రిజల్ట్స్ డిస్‌ప్లే చేస్తాయి. ఈ ఫలితాలలో యూజర్ డేటా డార్క్ వెబ్‌లో సర్క్యులేట్ అవుతున్నట్లు తేలితే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డేటా కచ్చితంగా అక్రమాలకు వినియోగించారని లేదా వేరే వారికి విక్రయించినట్లు అర్థం కాదు. అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ప్రధానంగా ఈమెయిల్ అకౌంట్‌తో లింక్ అయిన పాస్‌వర్డ్‌లను, డేటా బ్రీచ్ ద్వారా ప్రభావితమై ఏవైనా అకౌంట్స్‌ను వెంటనే మార్చుకోవాలి. పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చడం వల్ల ఇతరులు ఎవరూ వాటిని యాక్సెస్ చేయలేరు. డేటా లీక్ అయినా సరే పాస్‌వర్డ్‌లను మార్చడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!