తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు.