ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణా-గోదావరి డెల్టా కింద గల తీర ప్రాంతాలన్నీ అత్యధికంగా ముప్పునకు గురయ్యే ప్రాంతాలుగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్)కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కోయిస్) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ రాష్ట్రంలోని 706 గ్రామాలు, ఎనిమిది పట్టణాల్లోని దాదాపు 90 శాతం ప్రాంతం (కోస్టల్ మల్టి-హజార్డ్ జోన్-సీఎంజెడ్) బహుళ ప్రమాదాలు కలిగిన తీరప్రాంత జోన్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
Also Read : IPL 2023: లక్నోను ఆదుకున్న పూరన్.. కేకేఆర్ ఎదుట భారీ టార్గెట్
అందువల్ల సముద్రపు కోత కారణంగా ఈ ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ఈ గ్రామాల్లోని 32 లక్షల మంది ప్రజలు, వారి ఆస్తులన్నీ తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. సమీప గ్రామాల్లోని దాదాపు 51లక్షల మంది ప్రజలు పాక్షికంగా బాధితులవుతారు. వారికి ఒక మోస్తరు నుంచి తక్కువ ముప్పు వుంటుంది. తీర ప్రాంత ముంపు వల్ల తూర్పు గోదావరి, నెల్లూరు మధ్య మరినిు తీర ప్రాంత గ్రామాలు ఇటువంటి అనేక ముప్పులను ఎదుర్కొంటున్నాయి.
Also Read : Venkatesh: ఎన్టీఆర్ తో సినిమా చేయలేదు అన్న బాధ.. అందుకే ఆ పని చేశా
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సముద్రపు కోత, అవక్షేపాలు పేరుకుపోవడం వంటివి గత 48 సంవత్సరాల్లో (2019 వరకు) ఆందోళన కలిగించే రీతిలో వుననాయని ఇన్‌కోయిస్ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా డైనమిక్‌గా వును తీర ప్రక్రియ కారణంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాల్లో 66.3 కిలోమీటర్ల మేర అత్యధిక స్థాయిలో భూమి కోతకుగురైంది. 33.9 కిలోమీటర్లలో ఒక మోస్తరు కోత నమోదైంది, 180.3 కిలోమీటర్ల పొడవునా తక్కువగా భూమి కోతకు గురైంది.
Also Read : MSDhoni: ధోని కోసం ఢిల్లీ వీధుల్లో అభిమానుల హంగామా..
నెల్లూరు, విశాఖపటుం మధ్య ఇదంతా చోటు చేసుకుంది. మిగిలిన 662.9 కిలోమీటర్ల పొడవునా గల తీరప్రాంతంలో అవశేషాలు పేరుకుపోయాయి. తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటూ కృష్ణా-గోదావరి డెల్టా కింద గల తీర ప్రాంతాలనీు పల్లపు ప్రాంతాలు, అందువల్ల అవనీు అత్యధికంగా ముప్పునకుగురయ్యే ప్రాంతాలుగా కనుగొనాురు. విశాఖపటుం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు కొంచెం ఎత్తుపైన వుండడంతో వాటితో పోల్చుకుంటే కొంత తక్కువ ముప్పు వుంటుంది.
Also Read : MiG-21: మిగ్-21 విమానాలను నిలిపేసిన ఐఏఎఫ్.. కారణం ఇదే..
సీఎంజెతో కూడిన తీర ప్రాంత గ్రామాల విశ్లేషణ ప్రకారం.. 1420 గ్రామాలు, 15 పట్టణాల్లోని 83లక్షల మంది ఈ తీర ప్రాంత ముంపు పరిధిలో ఉనాురు. ఇన్‌కోయిస్ డైరెక్టర్ టి.శ్రీనివాస కుమార్ నేతృత్వంలో సీనియర్ శాస్త్రవేత్తలు టిఎం బాలకృష్ణన్ నాయర్, సుధీర్ జోసెఫ్, పిఎ ఫ్రాన్సిస్, పిసి మొహంతి, ఆర్.ఎస్.మహేంద్ర ఈ అధ్యయనానిు నిర్వహించారు. తూర్పు గోదావరి (18శాతం), పశ్చిమ గోదావరి (10శాతం), గుంటూరు (11శాతం), కృష్ణా(30శాతం) జిల్లాలు పల్లపు ప్రాంతాల కారణంగా అధికంగా సిఎంజెడ్ ఏరియాను కలిగి వున్నాయి. పైగా అధిక తీర ప్రాంతాన్ని కలిగివునుందువల్ల ముంపు భయం కూడా విస్తృతంగా వుంటుంది. గత శతాబ్ద కాలంలో వచ్చిన అలల తాకిడి కారణంగా నమోదైన తీవ్ర నీటి స్థాయిలను ఉపయోగించి ప్రస్తుత అధ్యయనాన్ని చేపట్టారు. శాటిలైట్, ఏరియల్, రిమోట్ సెన్సింగ్ సమాచారం ద్వారా రెండు కిలోమీటర్ల వరకు అధిక రిజల్యూషన్ కలిగిన భూ ఆకృతి డేటాను ఉపయోగించి సముద్ర విపత్తుల వల్ల సంభవించే వరదల ప్రాంతాలను సీఎంజెడ్ అంచనా వేసింది.