గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. 41 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వరద ముప్పు పొంచి ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణా-గోదావరి డెల్టా కింద గల తీర ప్రాంతాలన్నీ అత్యధికంగా ముప్పునకు గురయ్యే ప్రాంతాలుగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎం�