Venkatesh: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొని వేడుకను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వేదిక కళకళలాడుతోంది. ఇక ఈ వేడుకలో దగ్గుబాటి వారసుడు వెంకటేష్ కూడా పాల్గొన్నాడు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన.. ఎన్టీఆర్ గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు. ” మీ అందరి సమక్షంలో ఆయనను తలుచుకొనే అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మన మధ్యలో భౌతికంగా లేరు కానీ.. ఇన్ని ఏళ్ళ తరువాత.. ఇన్ని వేల మనుషుల మధ్య ఆయన పేరు ఇంకా వినిపిస్తుంది అంటే అది ఆయన గొప్పతనమని చెప్పుకోవాలి. మనల్ని ఎవరైనా .. మీదే భాష అని అడిగినప్పుడు నేను తెలుగువాడిని అని చెప్తాను. కానీ, చెప్పిన ప్రతిసారి ఆ పలుకులో ఒక చిన్న గర్వం ఉంటుంది. ఆ గర్వం పేరే ఎన్టీఆర్. ఆయన కథ ఒక్కడిది కాదు.. ఆయన కథ ప్రజలది.. ఆయన కథ దేశానిది.. ఆయనే ఎన్టీఆర్.
NTR: నా బాధల్లో.. సంతోషాల్లో తోడున్నది మీరే.. గుండెలను పిండేస్తున్న ఎన్టీఆర్ లేఖ
నా ఇన్నేళ్ల కెరీర్ లో నాకున్న ఒకే ఒక్క లోటు.. ఆయనతో నటించలేకపోయాను అని.. ఆయనతో నటించడమా కుదరలేదు కానీ, కలిసుందాం రా సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ లో ఆయనతో పాటు డ్యాన్స్ చేశాను. అది నాకు ఎంతో సంతోషం కలిగించిన క్షణం. సురేష్ ప్రొడక్షన్స్ అంటే రాముడు భీముడు. అలాంటి గొప్ప సినిమాను మా ప్రొడక్షన్ కు అందించినందుకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన నందమూరి కుటుంబానికి ధన్యవాదాలు” అని ముగించాడు.