ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణా-గోదావరి డెల్టా కింద గల తీర ప్రాంతాలన్నీ అత్యధికంగా ముప్పునకు గురయ్యే ప్రాంతాలుగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్)కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కోయిస్) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.