National Sports Meet: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల జాతీయ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు.
ఈ పోటీలకు 22 రాష్ట్రాల నుంచీ క్రీడాకారులు వచ్చారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వెల్లడించారు. జాతీయ స్పోర్ట్స్ మీట్ 2022 ఏపీలో నిర్వహిచడం గర్వకారణమన్నారు. ఆదివాసీల అభివృద్ధికి సీఎం జగన్ ముఖ్యమైన అడుగులు వేశారన్నారు. సీఎం జగన్ ఆదివాసీలకు రెండు జిల్లాలు ఇచ్చారన్నారు. ఈఎంఆర్ఎస్ స్కూళ్ళలో చదివే ఆదివాసీ పిల్లలు అందరి విద్యార్ధులకు ఆదర్శమన్నారు. లంబసింగిలో ఒక ట్రైబల్ స్కూలు బిల్డింగ్ కడుతున్నామన్నారు. ఆదివాసీలకు ప్రధాని చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో తాము పాల్గొంటున్నామని తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమన్నారు. క్రీడాకారులకు, కోచ్‌లకు అందరికీ అభినందనలు తెలిపారు.
Infosys Co-Founder: అన్ని రంగాల్లోనూ భారత్ విలువైన దేశంగా ఎదగాలి..
కృష్ణానదీ తీరంలో జరగనున్న నాలుగు రోజుల క్రీడలలో పాల్గొనడానికి 22 రాష్ట్రాల నుంచి వచ్చారని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుత అన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో మనకు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవాలన్నారు. బంగారం, రజతం, కాంస్య పతకాలు కామన్ వెల్త్ క్రీడల్లో ఆదివాసీలు సాధించారని ఆమె వెల్లడించారు. కేంద్రం ఒలింపిక్ క్రీడల సమయంలో క్రీడాకారులకు ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక స్పీచ్ ఇచ్చారన్నారు. అభినవ్ బింద్రా, సైనా నెహ్వాల్, విశ్వనాధ్ ఆనంద్ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గౌతం గంభీర్‌ను క్రీడాకారుడిగా కాకుండా లోక్‌సభకు ప్రజలు పంపారని పేర్కొన్నారు. మేరీ కోమ్.. ఇవాళ రాజ్యసభలో సభ్యురాలు అని.. పీటీ ఉషను కూడా రాజ్యసభ సభ్యురాలిగా చేశారన్నారు. ఏకలవ్య స్కూలులో చదివే వారికి ఏకాగ్రత, అకుంఠిత దీక్ష ఉండాలన్నారు.