మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్‌లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO, భింద్) DK శర్మ మీడియాతో మాట్లాడుతూ.. “నీటిలో ఇన్ఫెక్షన్ కారణంగా, కలరా వ్యాప్తికి సంబంధించిన కొన్ని కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కొంతమంది రోగులు జిల్లా ఆసుపత్రిలో చేరారు. వారిలో కొంతమంది స్థానిక కమ్యూనిటీ హెల్త్‌లో చికిత్స పొందారు. ఇప్పటి వరకు మొత్తం 84 మంది రోగులు కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కలరాతో ఇద్దరు వృద్ధులు మరణించారు” అని సీఎంహెచ్‌వో తెలిపారు.
Read Also: Mohan Charan Majhi: నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య
నగరంలో ప్రస్తుతం తాగునీటి సరఫరాను బంద్ చేసి ఇతర మార్గాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతంలోని ఇంటిని మొత్తం సర్వే చేసి మందులు, క్లోరిన్ మాత్రలు అందజేశాం.. నీటిని మరిగించిన తర్వాతే తాగాలని ప్రజలకు సూచించినట్లు చెప్పారు. అంతే కాకుండా ఎక్కడైనా నీటి కలుషితాన్ని తొలగించాలని నగర్ పాలికకు చెప్పినట్లు సీఎంహెచ్‌వో పేర్కొన్నారు. కేవలం కలుషిత నీటి కారణంగానే కలరా వ్యాప్తి జరిగిందని, ఒకసారి శాంపిల్‌ను పరీక్షించి చూస్తే అసలు విషయం స్పష్టమవుతుందని సీఎంహెచ్‌వో శర్మ తెలిపారు. మరోవైపు.. అంబులెన్స్‌లు ఏర్పాట్లు చేశామని, వైద్యుల బృందాన్ని కూడా పెంచామని, ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Madhya Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం..