Mohan Charan Majhi: నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య
- నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు..
- ఆ సమయంలో మేమంతా టీవీ చూస్తున్నాం..
- మంత్రి అవుతారని మాత్రమే ఊహించా..
- ఒడిశా సీఎం మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Charan Majhi: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దశాబ్ధంగా ఒడిశాను పాలిస్తున్న నవీన్ పట్నాయక్‌ని అధికారాన్ని నుంచి దించింది. అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలోని ఎంపీ స్థానాలను దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే ఈరోజు ఒడిశా సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఒడిశా రాష్ట్రానికి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ చరిత్ర సృష్టించారు.
తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో మోహన్ తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మంగళవారం మాఝీని కొత్త సీఎంగా ప్రకటించడంతో ఒక్కసారిగా వారంతా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. టీవీ ఛానెల్ ద్వారా ఈ విషయం తెలిసిందని, ఆ క్షణం వరకు తన భర్త సీఎం అవుతారని ఎప్పుడూ కూడా ఊహించలేదని ప్రియాంకా చెప్పారు.
Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
Read Also: Bombay High Court : “భారత్‌ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర”.. పీఎఫ్ఐ సభ్యులకు బెయిల్ నిరాకరణ..
బీజేపీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కుతుందని మాత్రమే ఊహించానని, ఇది నాకు, తమ కుటుంబానికి ఉత్కంఠభరితమైన క్షణమని చెప్పారు. ఈ ప్రకటన వచ్చే సమయంలో తాము వార్తా ఛానెల్‌ని చూస్తున్నట్లుగా ఆమె చెప్పారు. తన భర్త ఒడిశాకు, సొంత నియోజకవర్గం కియోంజర్‌కి మంచి చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తన కొడుకు సీఎం కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ మాఝీ తల్లి బలే మాఝీ అన్నారు. యువకుడి ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చాడని, మొదట సర్పంచ్ అయ్యాడని, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడని, ఇప్పుడు సీఎం అయ్యాడని ఆమె అన్నారు.
మా నాన్న సీఎం కావడం నాకు ఆశ్చర్యంగా ఉందని, స్నేహితులు తన నుంచి ట్రీట్ అడుగుతున్నారని 8వ తరగతి చదువుతున్న మాఝీ కుమారుడు కృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా మాఝీ సీఎం అయినందుకు మేమంతా సంతోషిస్తున్నామని, ఆయన చాలా వినయపూర్వక వ్యక్తి, ఖచ్చితంగా రాష్ట్రం కోసం పనిచేస్తారని సీఎం పొరుగు వారు చెప్పారు.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!