మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్‌లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు.