గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మహమ్మారి ‘కలరా’ కలకలం రేపుతోంది. అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సదరు మహిళ ప్రస్తుతం తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా…
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్‌లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు.
Boat Sink: పడవ మునిగి 90 మంది మరణించారు. ఈ విషాదకర సంఘటన మొజాంబిక్‌లో చోటు చేసుకుంది. ఆ దేశ ఉత్తర తీరంలో పడవ మునిగిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
600 Peoples Dies in Zambia Due to Cholera: ఆఫ్రికా దేశం అయిన జాంబియా.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జాంబియాను ప్రస్తుతం కలరా వ్యాధి పట్టిపీడిస్తోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారినపడగా.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అక్టోబర్ 2023 నుంచి దాదాపు 600 మంది కలరా వ్యాధితో మరణించారు. 15,000 మందికి పైగా కలరాతో బాధపడుతున్నారు.…
Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది.
పానీ పూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అసలు ఆ పేరు ప్రస్తావిస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇక ఎక్కడైన బండి కనిపిస్తే చాలు.. లగెత్తుకుని వెళ్లి పానీ పూరీ సేవించేస్తారు. ముఖ్యంగా.. సాయంత్రం వేళ్ల ప్రతిఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా స్నాక్స్‌గా తీసుకుంటారు. అలాంటి పానీ పూరీని ఒక చోట బ్యాన్ చేసేశారు. అదే.. నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో! అక్కడ పానీ పూరీ అమ్మకాల్ని నిషేధిస్తున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు ఓ…