* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉన్నత విద్యలో సంస్కరణలు, కాలేజీల్లో నాణ్యతపై చర్చ
* నేడు కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
* నేడు తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం
* నేడు జమ్ము కశ్మీర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
* కామారెడ్డిలో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు.. నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి జేఏసీ పిలుపు
* పల్నాడు : ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాచర్ల పట్టణంలో ఈనెల 22 వరకు కొనసాగనున్న 144 సెక్షన్
* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే పలు కార్యక్రమంలో పాల్గొంటారు.
* నెల్లూరులోని కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి కార్యక్రమం
* పశ్చిమగోదావరి జిల్లా: తణుకు నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వర రావు..
* అనంతపురం : ఎస్పీడీసీఎల్ ప్రతిపాదించిన విద్యుత్తు ఛార్జీలపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రజాభిప్రాయసేకరణ.
* అనంతపురం: పెద్దపప్పూరు మండలం లోని చిన్న పప్పూరు, చింతల పల్లి గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* తిరుపతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
* నేడు చంద్రగిరి భీమవరంలో జల్లికట్టు
* విజయనగరం: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నేడు యోగి వేమన జయంతి వేడుకలు..
* బాపట్ల : చీరాల మండలం జాండ్రపేటలో ఘనంగా ప్రారంభమైన శ్రీ దాదా అమీన్ పీర్ మాలిక్ 47వ గంధ మహోత్సవం.. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలలో భాగంగా ఘనంగా గంధ మహోత్సవం.. దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి ఫతేహా చెల్లించిన కడప దర్గా 11వ పీఠాధిపథి హాజరత్ ఖ్వాజా సయ్యద్ ఆరిఫుల్లా మొహమ్మద్ హుస్సేని..