Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- ఖార్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు చేస్తాం..
- ఇరాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: ఇరాన్‌కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని చెప్పారు. హార్ముజ్ జలసంధిని సురక్షితం చేయడానికి యుద్ధ నౌకల్ని పంపాలని మిత్రదేశాలను కోరారు.
అమెరికా దాడులు ఖార్గ్ ద్వీపంలోని చాలా భాగాన్ని “పూర్తిగా నాశనం చేశాయి” అని ట్రంప్ అన్నారు మరియు మరిన్ని దాడులు జరగవచ్చని, “మేము సరదా కోసం మరికొన్ని సార్లు దానిపై దాడి చేయవచ్చు” అని ప్రకటించారు. యుద్ధం ముగించడానికి ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పినప్పటికీ, నిబంధనలు ఇంకా సరిపోవు అని ఆయన అన్నారు. ఖార్గ్ ద్వీపంపై దాడి మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతల్ని పెంచాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు ప్రారంభించడానికి మిడిల్ ఈస్ట్‌లోని మిత్రదేవాలు చేసిన ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఖార్గ్ ద్వీపం ప్రత్యేకత:
ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఈ ద్వీపం ఉంటుంది. ఇక్కడ దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఖార్గ్‌పై దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న యూఏఈలోని ఓడరేవులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖార్గ్ దీవి ఇరాన్ దక్షిణ తీరానికి సుమారుగా 30 కి.మీ దూరంలో ఉంది.
అయితే, ఖార్గ్ ద్వీపం అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రధానంగా సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఆయిల్ నిల్వలు, ఎక్స్పోర్ట్ టెర్మినల్స్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయలేదు. ఈ దాడి ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించామని అమెరికా చెబుతోంది.
తాజావార్తలు
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!