ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని వెల్లడించింది. అన్నట్టుగానే ఇరాన్.. తాజాగా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పుడు మూడో దేశం అమెరికా కూడా తోడవుతోంది. ఇరాన్‌పై యుద్ధానికి రంగంలోకి దిగుతోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరుగుతోంది. అణు ఉత్పత్తిని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది.
ఇరాన్ అణు పరిశోధనా కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తునే ముప్పు వాటిల్లినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.