Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్‘ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు. ‘ధర్మన్’ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. రజనీకాంత్ లాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడంతో రుక్మిణి ఖుషీ అవుతోంది. తన కెరిర్ లో ఈ సినిమా స్పెషల్ గా నిలుస్తుందని భావిస్తోంది రుక్మిణి. దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ చిత్రాన్ని హై-వోల్టేజ్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేశారు. రుక్మిణి వసంత్‌తో పాటు ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్, టాలెంటెడ్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే స్టార్ కమెడియన్ యోగి బాబు తన మార్క్ కామెడీతో నవ్వించబోతున్నారు. ఇంతమంది క్రేజీ స్టార్స్ నటిస్తుండటంతో ‘ధర్మన్’ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అనిడిస్తుండగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
Also Read
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!