Physical assault on girl: దేశంలో అత్యాచారాలు అడ్డుకట్ట పటడం లేదు. రోజుకు ఎక్కడో ఓ మూల అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సంఘటనల్లో తెలిసిన వారే బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అగడాలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ముంబైలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడని నమ్మినందుకు బాలికపై దారుణానికి ఒడిగట్టారు.
Read Also: China: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కోవిడ్.. లీకైన డాక్యుమెంట్‌లో వెల్లడి
నమ్మి వెళ్లినందుకు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు కామాంధులు అఘాయిత్యానిక తెగబడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అత్యాచారం చేసిన వారిలో బాలిక స్నేహితుడు కూడా ఉన్నాడు. స్నేహితుడి పుట్టిన రోజు ఉందని బాలిక ఫ్రెండ్ చెప్పడంతో ఇద్దరు కలిసి వెళ్లారు. మరో ఐదుగురు నిందితులు అక్కడే ఉన్నారు. అయితే మొత్తం ఆరుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే ఆ ప్రాంతంలోని నివాసితులు బాలిక కేకలు విని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని డోంగ్రీలోని జువైనల్ హోమ్ కు పంపారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.