Mallareddy giving tea to brs leaders: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి రానుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు కేసీఆర్ స్వశక్తి కోసం అడుగులు వేస్తున్నారు. రెండు రోజులుగా బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ బీఆర్ఎస్ కార్యాలయ పనులను పర్యవేక్షిస్తున్నారు.
అయితే ఢిల్లీలో అతిథులకు చాయ్ ఇస్తున్న మంత్రి మల్లా రెడ్డి వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీలో బీఆర్‌ఎస్ భవన్ వద్దకు వచ్చిన నాయకులకు మంత్రి మల్లారెడ్డి పలకరించి, నాయకులకు చాయ్ కప్పులు పట్టుకుని ఉంటే వారికి తన దగ్గర వున్న మగ్గులో నిండా చాయ్ వుంది. దానిని పార్టీ నాయకులకు కప్పులో వేస్తుండటం. వారు ఆనందంగా తీసుకుని చాయ్ తాగడం ఆశక్తి నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ఇలా చాయ్ వాలాగా మారడంతో చర్చనీయాంశంగా మారింది. కొందరు చాయ్ వాలాగా మారిన మంత్రి మల్లారెడ్డి అంటూ విమర్శిస్తుంటే.. మరికొందరు అందరూ ఉన్నచోటు పదవులతో సంబంధం లేకుండా అంతా సమానంగా ఆనందంగా మెలగడం అంటే ఇదేనేమో అంటూ ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ భవనంలో ఈసీన్ తెరపైకి రావడంతో పలువురు హర్షం చేస్తున్నారు.
ఇవాళ జరగనున్న బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది. నేడు జపాన్ వ్యాపార ప్రపంచ ప్రముఖులతో భేటీ కానున్న కేటీఆర్.. జపాన్ కంపెనీ బాష్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వారు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ అనుమతితోనే బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.