Christmas Gift : ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులకు లక్ష డాలర్లు బోనస్‌గా ప్రకటించింది. వీటి విలువ అక్షరాలా మన దగ్గర 80 లక్షల రూపాయల పైమాటే. కరోనా తర్వాత, ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఖర్చు తగ్గింపును అనుసరిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు పేరుతో భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయోనన్న భయంతో ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో, ఆస్ట్రేలియాలో మైనింగ్ మొగల్‌గా పేరుగాంచిన జార్జినా హోప్ రెన్ హార్ట్ మాత్రం తన పెద్ద మనసును ప్రదర్శించింది.
Read Also: Vijay Sethupathi: స్లిమ్ గా మారిన విజయ్ సేతుపతి.. అదుర్స్ అంటున్న అభిమానులు
ఆస్ట్రేలియాలో హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి జార్జినా (గినా) రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన ఆమె 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె తండ్రి స్థాపించిన హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో ఇటీవల ఆమె సమావేశమయ్యారు. వారికి క్రిస్మస్ బోనస్‌గా లక్షల అమెరికన్ డాలర్లు ప్రకటించారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ప్రకటన విన్న ఉద్యోగులు ఆనందంతో నోరెళ్లబెట్టారు. బోనస్ పొందిన వారిలో మూడు నెలల క్రితమే కంపెనీలో చేరిన ఓ ఉద్యోగి ఉండటం గమనార్హం. గత 12 నెలల్లో కంపెనీ లాభాలు 3.3 బిలియన్ డాలర్లు. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా వివరాలను వెల్లడించింది.