మహారాష్ట్రలో రాజకీయ చదరంగం ఇంకా ముగిసిపోలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవిని చేపట్టాడు. బీజేపీ, శివసేన రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని 67 మంది కార్పొరేటర్లలో 66 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు.…