Gujarat cabinet: గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. కొత్త మంత్రివర్గంలో 15 మంది కొత్త వ్యక్తులు సహా 25 మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రుల్లో కొందరు కొత్త లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…
రేపు విశాఖ వేదికగా భారతీయ జనతాపార్టీ 'సారథ్యం' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహి స్తోంది. ఏపీలో సంస్ధాగత బలోపేతం., ఓట్ బ్యాంక్ పెంచుకోవడం లక్ష్యంగా జరుగుతున్న మీటింగ్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేడర్ కు మార్గనిర్ధేశం చేయనున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ సహావిపక్షాలు సాధించిన ఓట్లను తమవైపు తిప్పుకోవడం, స్ధానిక సంస్ధల ఎన్నికలకు సమాయత్తం సభ లక్ష్యమని కమలదళం చెబుతోంది. మరోవైపు, స్టీ ల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్టు…
బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచో పార్టీ ఆలోచన చేస్తోంది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని.. ఏపీకి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా రైతులకు యూరియా అందడం లేదని.. యూరియా అనేక చోట్ల దాచిపెడుతున్నారు అని ఆరోపించారు.
MLA Rajasingh: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్ కు పంపించాలని కూడా సూచించారు. Read Also:Asia Cup 2025: ఆసియా కప్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికి రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. వానాకాలం సాగు దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరారు. Also Read: Bandi Sanjay: విద్యార్థులకు శుభవార్త..…
CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్, అమిత్ షా లతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ భేటీల్లో ఆయన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో విస్తృత చర్చలు జరపనున్నారు. ఇందులో ముఖ్యంగా.. Read Also:Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా…
Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య…
ప్రధాని మోడీ 11 ఏళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జూన్ 9 నాటికి మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు.