Kerala: 2005లో కేరళలో జరిగిన బీజేపీ కార్యకర్త ఎలాంబిలాయి సూరజ్ హత్య కేసులో 9 మంది సీపీఎం కార్యకర్తలను కోర్టు దోషులుగా తేల్చింది. దోషుల్లో సీఎం పినరయి విజయన్ ప్రెస్ సెక్రటరీ సోదరుడు కూడా ఉన్నాడు. శుక్రవారం వీరిందరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిని వారిలో టీకే రజీష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇతను 2012లో జరిగిన టిపీ చంద్రశేఖరన్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరో దోషి పీఎం మనోరాజ్, ఇతను సీఎం…
Kerala High Court: వామపక్ష సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. 2017లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్‌లో వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులపై అభియోగాలను కేరళ హైకోర్టు రద్దు చేసింది.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2024 వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
CM Pinarayi Vijayan: వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు.
జూలై 13న అదృశ్యమైన పారిశుధ్య కార్మికుడి మృతదేహం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కాలువలో సోమవారం ఉదయం లభ్యమైంది. శనివారం రోజున అమైజాంచన్ కాలువను శుభ్రం చేస్తుండగా పారిశుధ్య కార్మికుడు జాయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నావికాదళం, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సోమవారం ఉదయం అతడి కోసం గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి భయపెడుతుంది. కోజికోడ్ లో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధితో 15 ఏళ్ల బాలుడు మరణించాడు.
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్‌లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా.. భారీ నుండి…
Money Laundering Case: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతరు చిక్కుల్లో పడ్డారు. సీఎం కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు బుధవారం తెలిపాయి.