మహారాష్ట్రలో వైద్యురాలి మరణాన్ని మరువక ముందే మరో అబల బలైపోయింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట వేధింపులకు నారీమణులు బలైపోతున్నారు. ముంబైలో తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి చెందింది.
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.…
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమె.. మాజీ ప్రపంచ ఛాంపియన్. ఇండియన్ నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత. ఆమెనే సావీటీ బూరా. దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఈమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తన భర్త, అత్తింటి వారు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్‌లోని న్యాయమూర్తుల విభా కంకన్‌వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
Allahabad HC: ఒక వ్యక్తిపై భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపుల ఆరోపణల్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపబ్టింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆమె ఆరోపణలు చేసిందని కోర్టు భావించింది. మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు మహిళ ఆరోపణల్ని కొట్టిపారేసింది. వరకట్న వేధింపులతో పాటు తన భర్త అసహజ సెక్స్‌కి బలవంతంగా చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలు అన్నింటి కోర్టు కొట్టివేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.
Dowry case: పెళ్లి సమయంలో కూతురికి నగదు కాకుండా 6 గ్రాముల బంగారం ఇస్తామని ఓ తండ్రి హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే నగదు, మూడు గ్రాముల బంగారం ముట్టజెప్పాడు. మిగతా మూడు గ్రాముల బంగారం ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేకపోయాడు.
Shocking News : బీహార్‌లోని బక్సార్లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపుల కేసులో ఆరేళ్ల తరువాత వివాహిత సజీవంగా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.