Rajnath Singh: పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్(పీఓకే)పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కృషిని రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ, కాశ్మీర్‌లను సమానం చూస్తుందని చెప్పారు. అఖ్నూర్ సెక్టార్‌లోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్‌లో 9వ సాయుధ దళాల మాజీ సైనికులు దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
‘‘గత ప్రభుత్వాలు కాశ్మీర్‌ని భిన్నంగా చూశాయి. ఫలితంగా ఈ ప్రాంతంలోని మన సోదరులు, సోదరీమణులను దేశంతో కలపలేకపోయారు. మా ప్రభుత్వం కాశ్మీర్ ,దేశంలోని మిగత ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది’’ అని అన్నారు. ఈ దిశగా సరైన చర్యలు తీసుకున్న సీఎం ఒమర్ అబ్దుల్లా అని ప్రశంసించారు.
Read Also: Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రధాని చౌదరి అన్వరుల్ దేశానికి భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణం కాదని చెప్పారు. మాజీ సైనికులకు మకర సంక్రాంతి, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహించొద్దని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. వాటిని నాశనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. పీఓకే పాకిస్తాన్‌కి విదేశీ భూభాగం తప్పితే మరేమీ కాదని ఆయన అన్నారు.
1965లోనే అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసి ఉండేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. “1965లో అఖ్నూర్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైన్యం ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారతదేశం విజయం సాధించింది. .పాకిస్తాన్ 1965 నుండి అక్రమ చొరబాట్లను,ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, ” అని అన్నారు. నిజానికి 1965లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవాల్సింది, యుద్ధం నుంచి లభించిన వ్యూహాత్మక ప్రయోజనాన్ని వాడుకోలేకపోయిందని అన్నారు.