India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం.
Pok Protests: పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా బలగాలు అరాచకానికి పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకేలోని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
PoK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జనం తిరగబడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సంవత్సరాల తరబడి పాకిస్తాన్ దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. అయితే, ప్రతీసారి పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది.
Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా…
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన CII బిజినెస్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన, PoK ప్రజలు భారత్ కుటుంబంలోని భాగమే అంటూ, త్వరలోనే వారు భారత్ లో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మా సొంతవారు, మా కుటుంబ సభ్యులే అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు భౌగోళికంగా, రాజకీయంగా వేరుపడిపోయిన మా సోదరులు…
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
Pakistan: పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
China Support Pak: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.