పాపులర్ జోడి తమన్నా, విజయ్ వర్మ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తొలిసారి కలిసి వర్క్ చేసిన వీరిద్దరు రోమాన్స్, బెడ్ రూమ్ సీన్స్‌లో ఉహించని విద్ధంగా నటించారు. అలా ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో స్వయంగా వెల్లడించిన తమన్నా, ఇటీవల ప్రేమ గురించి సోషల్ మీడియాలో ‘రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నా.. భాగస్వామి ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలి’ అంటూ హెచ్చరిక చేసింది. దీంతో ఈ రూమర్స్ మరింత పుంజుకున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Vikram : ప్రేక్షకులకు క్షమాపన చెప్పిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ నిర్మాత
‘రిలేషన్షిప్‌ను ఒక ఐస్క్రీమ్‌లాగా ఆస్వాదించాలి. అలా చేసినప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఆనందం, బాధ, కోపం, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని నువ్వు స్వీకరించాలి. దానితోపాటు ముందుకు సాగాలి’ అని తెలిపాడు. దీంతో అతని మాటలు వైరల్‌గా మారాయి. బంధాని ఇలా ఐస్క్రీమ్ తో పోల్చుతున్నందుకు ఒక్కింత హాస్యం వ్యాక్తం చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో రోజుకో ఫోటో పెడుతూ అన్యోన్యంగా ఉన్న ఈ జంట, ఇలా విడి విడిగా ఉండటం చూడలేక పోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు సడన్‌గా విడిపోవడానికి, ఇద్దరి మధ్య అంతలా ఏం జరిగిందా? అని ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.