కొందరు సరదా కోసం జంతువులను హింసించడం సోషల్ మీడియా లో అనేక సార్లు చుస్తూనే ఉంటాము. ఇది ఇనిజానికి దారుణమని తెలిసిన సాహసం పేరిట జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం మనము చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతంసోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.., ప్రజలు మాత్రం వీడియోలో యువకుడు చేసిన పనికి అతనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Viral Video : కోతికున్న మానవత్వం మనిషికి లేదాయే.. చూడండి ఏం చేసిందో..
ఈ వీడియోలో ఉన్న యువకుడు ఓ రహదారి పక్కన పొదల్లో సంచరిస్తున్న ఓ చిన్న పామును పట్టుకున్నాడు. ఆపై ఆ పాము తలను ఎటూ కదలకుండా రెండు వెళ్లతో గట్టిగా అదిమి పట్టుకోవడంతో పాము నొప్పితో అల్లాడడం మనం గమనించవచ్చు. ఆపై పాము తల భాగాన్ని బీర్ క్యాన్ మూత వద్దకు తీసుకురావడంతో అది అందులోకి విషాన్ని చిమ్మింది. అయినా కానీ ఆ యువకుడు మాత్రం తన చేస్తున్న పనులను మార్చుకోకపోగా మరో షాకింగ్ పనికి ఒడిగట్టాడు.
Also Read: BSNL Recharge Plans 2024: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు శుభవార్త.. రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల గడువు పెంపు!
బీర్ లో పాము చిమ్మిన విషాన్నిబాగా కలిసేలా చేసి తాగేశాడు. ఇకపోతే ఆ వీడియో అక్కడితో ముగియడంతో ఆ తర్వాత ఏం జరిగిందీ అనేది తెలియరాలేదు. ఈ వీడియో చుసిన నెటిజన్స్.., పాము విషం తాగితే ఏం కాదని కొందరు వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఆ విషం నేరుగా రక్తంలో కలిస్తేనే మనిషికి ప్రాణాంతకమని చెబుతున్నారు. నిజానికి పాము విషం అనేది ఓ ప్రొటీన్ అని, దాన్ని తాగితే ఇతర ప్రొటీన్ల మాదిరిగానే కడుపులో అరిగిపోతుందని మరికొందరు వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
https://www.instagram.com/p/C4G1z8HxHYC/?utm_source=ig_embed&utm_campaign=invalid&ig_rid=c9ea646e-40c7-4727-9cd3-abdf6645a7fa