Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏ పార్టీకి ఎవరు ఎంత నిధులు అందించారనే విషయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)ని ఆదేశించింది. ఈ మేరకు నిన్న భారత ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో సమాచారాన్ని ఉంచింది. అత్యున్నత కోర్టు కఠిన ఆదేశాల తర్వాత ఎస్‌బీఐ దిగి వచ్చింది. ఎస్‌బీఐ మంగళవారం సాయంత్రం ఈ వివరాలను ఈసీకి అందించగా.. గురువారం ఈసీ ఈ వివరాలను బహిర్గతం చేసింది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని.. సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు