తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని అన్నా రోడ్డులో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందంటూ ఒక్కసారిగా ఐదు అంతస్తుల భవనం నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో అన్నా రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నిజమా? లేదంటే పుకార్లు సృష్టించారా? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sree Vishnu : ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్
శుక్రవారం ఉదయం నేపాల్, పాకిస్థాన్, ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బీహార్‌లోని పాట్నాలో ప్రకంపనలు జరిగాయి. ఇంట్లో ఫ్యాన్లు ఊగిపోయాయి. భయాందోళనతో ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Harish Rao: ఎమ్మెల్యే హరీష్ రావుపై మరో కేసు నమోదు!
నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 5.14 గంటలకు భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి 9 పేజీల బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్!