Sree Vishnu : ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫరెంట్ మూవీస్ ప్రేక్షకులను మెప్పిస్తోన్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో అలరించబోతున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా జాన్ హీరోయిన్. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రమిది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్ టీజర్‌ను గమనిస్తే వాయిస్ ఓవర్‌లో ‘గేమ్ ఓవర్ జయ్’ అని వినిపిస్తోంది. శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఫ్లాష్ కట్స్‌ను చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా చూపించిన ఈ గ్లింప్స్‌లో చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూడొచ్చు. చివర్లో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ వస్తుంది. ఈ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ ‘మృత్యుంజయ్’ అని సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ‘మృత్యుంజయ్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మరో ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించనుందని తెలుస్తోంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read : Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ.. గెలుపెవరిదో..?
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!