ఉత్తర భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది
తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని అన్నా రోడ్డులో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందంటూ ఒక్కసారిగా ఐదు అంతస్తుల భవనం నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో అన్నా రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Heavy Snowfall: దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఈ రోజు (జనవరి 10) ఉదయం ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. అయితే గత కొంత కాలంగా ఏటా చలికాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. చల్ల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు వంటి కాలానుగుణ వాతావరణ పరిస్థితులు ఏటా ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పెంచుతాయి.
Udhayanidhi Stalin: బాలీవుడ్పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.
తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి పెద్ద ఆరోపణ చేశారు. రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నారని.. దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతున్నదని అన్నారు.
పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.