టాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్ నయన్ సారిక బిగ్ ప్రాజెక్టులను తన బ్యాగ్‌లో వేసుకుంది. క, ఆయ్‌లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హీరోలకు లక్కీ లేడీగా మారిన ఈ సోలాపూర్ బ్యూటీ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ సోయగం ఈసారి ఇండియన్ ఇండస్ట్రీపై కన్నేసింది. పాన్ ఇండియా చిత్రాల్లో నటించే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొల్లగొట్టింది.
Also Read : Sanjay Duth : సంజయ్ దత్.. సరికొత్తగా.. కలిసొచ్చేనా..?
కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన పినాకలో నటించే ఛాన్స్ దక్కించుకుంది నయన్ సారిక. బైలింగ్వల్ మూవీగా తీస్తున్నప్పటికీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.. మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు గోల్డెన్ స్టార్. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న పినాకను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాతో మెగాఫోన్ పట్టబోతున్నాడు కొరియోగ్రాఫర్ ధనుంజయ. నయన్ సారిక మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా భాగస్వామ్యమైంది. మోహన్ లాల్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ వృషభలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్‌గా నటించబోతుందని టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇటీవలే వృషభ షూటింగ్ కంప్లీట్ కాగా, దసరా లేదా దీపావళికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడు దర్శకుడు నంద కిశోర్. పీరియాడిక్ ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోంది. ఇటు కన్నడ, అటు మలయాళ ప్రాజెక్టులతో టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోన్న నయన్ సారిక రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్స్ క్యాటగిరి లిస్ట్ లోకి చేరుతుందేమో చూడాలి.