AAP vs BJP: న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీ మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. ముందుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశిస్తూ, ఆర్ఎస్ఎస్‌కి లేఖ రాయడంతో వివాదం మొదలైంది. బీజేపీ చర్యలను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందా..? అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి లేక రాశారు. అయితే, దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ ఏడాదైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కేజ్రీవాల్‌కి బీజేపీ హితవు పలికింది. కేజ్రీవాల్ చేసిన 10 హామీను కమలం పార్టీ హైలెట్ చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన దశాబ్ధం గడిచినా వాటిలో ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.
“విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని, విద్యావ్యవస్థను మెరుగుపరుస్తానని, ఆరోగ్య సంరక్షణను పెంపొందించుకుంటానని, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారిస్తానని, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తానని, మురికివాడల నివాసితులకు గృహాలను అందిస్తానని, యమునా నదిని శుభ్రం చేస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఈ హామీలలో ఒక్కటి నెరవేర్చలేదు’’ అని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
Read Also: Shocking: ‘‘ వారి గౌరవాన్ని కాపాడా ’’.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన వ్యక్తి..
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిని ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ నగరంలోని మహిళ భద్రతకు హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి నివాసంలోనే ఓ మహిళా ఎంపీపై దాడి జరిగింది, ఇలాంటిది దేశంలో తొలి సంఘటన అని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని చెబుతూ, ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని సుధాన్షు త్రివేది ఆరోపించారు.
దీనికి ముందు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా కేజ్రీవాల్‌కి లేఖ రాశారు. కొత్త ఏడాది నుంచి కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, తప్పుడు వాగ్దానాలు చేయడం వంటి 5 తీర్మానాలు చేయాలని కోరారు. కేజ్రీవాల్ మోహన్ భగవత్‌కి లేఖ రాస్తూ.. బీజేపీ ఓట్లను కొనుగోలు చేసిందని, ఓటర్ల జాబితాలో తారుమారు చేసిందని ఆరోపించారు.